జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ తనయుడు హంగామా

జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ జనతా గ్యారెజ్ సెట్స్లో సందడి చేశాడు. తండ్రి నటిస్తున్న సినిమా సెట్స్లో తొలి సారిగా చిన్నారి అభయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

దీంతో సెట్లో అందరికళ్లూ అభయ్ రామ్ పైకి మళ్లాయి. దర్శకుడు సైతం మెగాఫోన్ వదిలిపెట్టి అభయ్ రాముడి సందడిని చూసేందుకని లేచి నిలుచున్నాడు.  జనతా గ్యారేజ్ సెట్లో చోటు చేసుకొందీ దృశ్యం. దీంతో ఈ అరుదైన సంబరాన్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తన ఫేస్ బుక్ పేజీలో ముద్దుల కొడుకు సెట్స్లో హల్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో తమ అభిమాన హీరో వారసుడి ఫోటోలకు లైక్లు, షేర్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడిగా  నటిస్తున్న  చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఆ సెట్ కి సోమవారం ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ వచ్చాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి తన తనయుడిని వెంట తీసుకొని సెట్ కి వచ్చారు. దీంతో సెట్లో సందడి వాతావరణం నెలకొంది. అభయ్ చాలాసేపు సెట్ లో ప్రాపర్టీల్ని పట్టుకొని వాటిని తదేకంగా పరిశీలిస్తూ సందడి చేశాడట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *