ఒబామాకి ఒకటి మోడీకి ఏడు

ఓఆర్ బీ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో ప్రపంచదేశాలలో  అత్యంత పాపులర్ నేతగా మొదటి స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు.  ఈ సర్వేలో 24శాతం మంది మోదీకి అనుకూలంగా ఓటు వేశారు. ఓఆర్ బీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వరల్డ్ లీడర్ సూచిక విన్/గాలప్ సర్వేలో మోదీకి ప్లస్4 శాతం ఓట్లేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 20 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సర్వేలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని వెనక్కి నెడుతూ 30 శాతం ఓట్లతో ఆరో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు అనుకూలంగా 59 శాతం ఓట్లు, ఆయనకు వ్యతిరేకంగా 29 శాతం ఓట్లు పోలవడం వార్తల్లో నిలిచింది. రెండో స్థానంలో ప్లస్ 13శాతంతో జర్మనీ చాన్స్ లర్ ఎంజెలా మోర్కెల్ నిలిచారు.
మూడో స్థానంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ నిలిచారు. ఆయనకు ప్లస్ 57 శాతం ఓట్లు వచ్చాయి. ఆయనకు వ్యతిరేకంగా 37 శాతం ఓట్లు వేశారు.ఈ ఓట్లలో దక్షిణాసియా దేశాల నుంచే 57 శాతం ఓట్లు వచ్చాయని సమాచారం. ఈ జాబితాలో వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్(8), సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ అసద్(9), ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ(10)లు కూడా ప్రజాదరణ పొందతున్న నేతలలో స్థానం సంపాదించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *