యూఏఈతో భారత్ మ్యాచ్ నేడు

టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశమిస్తాం ఇది టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ ఆసియాకప్‌కు ముందు చేసిన వ్యాఖ్య. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఆసియా కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ఫైనల్లోకి ప్రవేశించిన ధోనీసేన ఇప్పుడు రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు సిద్ధమైంది. ఇందుకు పసికూన యూఏఈతో గురువారం జరిగే రౌండ్ రాబిన్ లీగ్ చివరి మ్యాచ్‌ను వేదికగా చేసుకోవాలనుకుంటున్నది.

ఆసియాకప్‌లోఅపజయంఅన్నదిలేకుండాదూసుకెళుతున్న ీమ్‌ఇండియా నామమాత్రపు పోరుకు సిద్ధమైంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో ఇప్పటికే టైటిల్ పోరులో నిలిచిన ధోనీసేన గురువారం యూఏఈతో తలపడుతుంది. ఈనెల 6న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ప్రాక్టీస్‌గా యూఏఈతో పోరును ఉపయోగించుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తున్న ది. దీంతో పాటు టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టు ను అన్ని విభాగాల్లో పటిష్ఠం చేసేందుకు సిద్ధమవుతున్నది. రిజర్వ్ బెంచ్‌కు చాన్స్: టోర్నీలో ఇప్పటి వరకు తుదిజట్టుకు ఎంపిక కానీ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వాళ్లకు వకాశమివ్వనుంది. దీంతో విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న కొంత మంది ైస్ట్రెక్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించనుంది. ముఖ్యంగా వెటరన్ ఆశిష్ నెహ్రా జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపిస్తున్నాడు.

బరిలోకి దిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో టీమ్‌ఇండియా విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. అయితే యూఏఈతో మ్యాచ్‌లో నెహ్రాకు బదులుగా భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. గతంలో మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియా తరఫున అద్భుతంగా రాణించిన భువీ ఈ మధ్య వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. బంతిని ఇరువైపుల స్వింగ్ చేసే నైపుణ్యమున్న భువీ.. యూఏఈతో మ్యాచ్‌లో రాణించి ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకోవాలనుకుంటున్నాడు. ఇక స్టార్ స్పిన్‌ద్వయం అశ్విన్, జడేజా స్థానంలో సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్, పవన్ నేగి తుది జట్టులోకి వచ్చే చాన్సుంది. ఆస్ట్రేలియా, శ్రీలంకతో సిరీస్‌లకు జట్టుకు ఎంపికైనా అశ్విన్, జడేజా అద్భుతంగా రాణిస్తుండటంతో హర్భజన్‌కు ఫైనల్ లెవన్‌లో చోటు దక్కలేదు. తన స్పిన్ నైపుణ్యాన్ని నిరూపించుకునేందుకు ఇప్పుడు భజ్జీకి మంచి అవకాశం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *