కొణిదెల నిహారిక-నాగ శౌర్య ఒక మనసు…

ఈ నెల 18 ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిహారిక అఫీషియల్ గా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా ఆడియో రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ చిత్రం హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది.

ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు. నిహారిక నటన పరంగా ఫర్వాలేదని ఇప్పటికే ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా నిరూపించుకుంది. ఇందులో ఆమె కాస్త అల్లరి పిల్లలా కనిపించినా…. ఈ సినిమాలో మాత్రం చాలా డీసెంట్ రోల్ చేస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేసారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో నాగ శౌర్య-నిహారిక మధ్య వచ్చే సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయని స్పష్టమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *