చివరికి ఏం మిగిలింది-ఫస్ట్ డే కలెక్షన్

అనుకున్నంతా అయ్యింది. మంచు మనోజ్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత ఎంతో కష్టపడి చేసిన డ్యూయల్ రోల్ మూవీ ‘ఒక్కడు మిగిలాడు’ దారుణమైన టాక్ తో పాటు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రానటువంటి తక్కువ రేటింగ్స్ తో రివ్యూల రూపంలో కూడా నెగటివ్ రిపోర్ట్స్ తెచ్చుకుంది. అసలే ట్రైలర్ అంతంత మాత్రంగా ఉండి ఇది మన నేటివిటీ సబ్జెక్టు కాదేమో అనే అనుమానాలు రేకెత్తించి చివరికి వాటినే నిజం చేసి చూపించింది.

ఓపెనింగ్స్ చాలా చోట్ల మరీ నీరసంగా ఓపెన్ కావడం ఇప్పటికే నిర్మాతలను కలవరపెడుతుండగా మరో వైపు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. మొత్తంగా కోటి రూపాయల షేర్ కూడా రాలేదని ట్రేడ్ నుంచి సమాచారం అందుతోంది. చాలా చోట్ల ఈవెనింగ్ షోలకే జనం లేక హాళ్ళు వెలవెలబోయాయని అంటున్నారు.

ఇది మంచు వారి హీరోని పెద్ద దెబ్బే కొట్టబోతోంది. తన ఇమేజ్ ఎంత డౌన్ ఫాల్ లో ఉందొ మనోజ్ కు దీని ద్వారా స్పష్టంగా అర్థమైపోయింది. కొన్ని ఏ సెంటర్స్ లో తప్పించి మార్నింగ్ షో సైతం ఎక్కడ ఫుల్ కాలేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఒకపక్క కేరాఫ్ సూర్య యావరేజ్ టాక్ తో సేఫ్ జోన్ వైపు వెళ్ళే అవకాశం ఉండగా విశాల్ డిటెక్టివ్ పై పాజిటివ్ మౌత్ టాక్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.

నేటివిటీ ప్రాబ్లెంతో పాటు అర్థం లేని కథా కథనాలతో అప్పుడెప్పుడో వచ్చిన తమిళ్ సినిమా రావణ దేశంని ఫ్రీగా రీమేక్ చేసుకున్న దర్శకుడు అజయ్ నూతక్కి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనోజ్ కొత్తగా ఉంటుందని ట్రై చేసిన ప్రభాకరన్ పాత్రలో చేసిన ఓవర్ యాక్షన్ కూడా నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కనీసం పెట్టుబడిలో సగమైన వచ్చే అవకాశాలు లేని ఒక్కడు మిగిలాడు మనోజ్ ని మరో సారి ఒంటరిని చేసేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *