ఒలింపిక్స్ లో కండోమ్ లు

జికా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రపంచంలోనే కండోమ్స్ తయారీలో రెండో స్థానంలో ఉన్న ఆన్సెల్ కంపెనీ లిమిటెడ్ తో ఆస్ట్రేలియా ఔషద తయారీ కంపెనీ స్టార్ ఫార్మా హోల్డింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అథ్లెట్లు అందరికీ స్టార్ ఫార్మా వాళ్ల వివాజెల్ తో లూబ్రికేట్ చేసిన డ్యూయెల్ ప్రొటెక్షన్ కండోమ్స్ ఇస్తామని చెప్తున్నారు. శృంగారం ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తాము తయారు చేసిన వివాజెల్ ప్రాడెక్ట్ ఈ వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకుంటుందని స్టార్ ఫార్మా హోల్డింగ్స్ సీ ఈ వో ఫ్లైరీ చెపుతున్నారు.

ఈ అంశంపై ఆస్ర్టేలియా ఒలింపిక్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఆటగాళ్ల కోసం ఇప్పటికే ఒలింపిక్స్ గ్రామాలకు కొన్ని కండోమ్స్ పంపామని మిగిలిన కండోమ్స్ను కూడా త్వరలోనే పంపుతున్నట్టు తెలిపారు. విడి కండోమ్స్ తో పాటు ఒలింపిక్ గ్రామాల్లో కొన్ని కండోమ్స్ డిస్పెన్సింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెషిన్ల ద్వారా ఎక్కడికక్కడ కండోమ్స్ లభ్యమవుతాయి. ఈ మెషిన్ల ద్వారా 3.50 లక్షల పురుషుల కండోమ్ లు – లక్ష మహిళల కండోమ్ లు అథ్లెట్లకు ఉచితంగా అందిస్తారు. రియో నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లకు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించాలన్న నిబంధనలు ఉన్నట్లు వచ్చిన కథనాలను ఏఓసీ ఖండించింది. ఈ అంశంపై ఒక ప్రాడెక్టును మార్కెట్ చెయ్యాలన్నా వ్యాపారాన్ని విశ్వ వ్యాప్తం చెయ్యాలన్నా ప్రపంచమంతా చూసే ఒలింపిక్స్ కన్నా చక్కని వేదిక మరొకటేముంటుందని వ్యాపార వర్గాలు గుసగుసలాడుతున్నాయి..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *