ఆన్‌లైన్‌ ఫెస్టివ్‌ సేల్స్‌ అదుర్స్‌

పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఇ- కామర్స్‌ కంపెనీలు ప్రకటించిన డిస్కౌంట్‌ సేల్స్‌కు మంచి ఆదరణ లభించింది. ఐదు రోజుల కాల పరిమితికి ప్రకటించిన ఈ డిస్కౌంట్‌ సేల్‌లో తొలి రోజు మంచి స్పందన వచ్చిందని, లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయని స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించాయి. అయి తే తమకు చేదు అనుభవం ఎదురైందని కొందరు సామాజిక మీడియా సైట్లలో ఫిర్యాదులు చేశారు. తాము సాధారణ బిజినెస్‌ కన్నా డిస్కౌంట్‌ సేల్‌ తొలిరోజు ఆరు రెట్లు అధిక వ్యాపారం సాధించామని అమెజాన్‌ తెలిపింది. అక్టోబరు ఒకటో తేదీన ఆఫర్‌ మొదలైన అరగంట వ్యవధిలోనే లక్ష ఉత్పత్తులు, 12 గంటల్లో 15 లక్షల ఉత్పత్తులు విక్రయించామని ఆ కంపెనీ తెలియచేసింది. తొలి 16 గంటల వ్యవధిలో తమ వెబ్‌సైట్‌ ద్వారా 2800 నగరాలకు చెందిన 11 లక్షల మంది కొనుగోలుదార్లు వస్తువులు కొనుగోలు చేసినట్టు స్నాప్‌డీల్‌ ప్రకటించింది.

అర్ధరాత్రి ప్రారంభమైన ఈ సేల్‌లో సెకనుకు 180 ఆర్డర్లు నమోదైనట్టు తెలిపింది. తాము ఒక గంటలోనే ఐదు లక్షలకు పైగా ఉత్పత్తులు విక్రయించినట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఎలక్ర్టానిక్స్‌, గాడ్జెట్స్‌ విభాగంలో 10 నిమిషాల్లోనే అధిక సంఖ్యలో ఆపిల్‌ వాచ్‌లు విక్రయించినట్టు పేర్కొంది. ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని ఒక నెల రోజుల్లో విక్రయించినన్ని ఆపిల్‌ వాచీలను 10 నిమిషాల్లోనే విక్రయించగలిగినట్టు తెలిపింది. తొలి ఆరు గంటల సమయంలో తమ అమ్మకాలైతే 2015లో ప్రకటించిన బిగ్‌బిలియన్‌ డేలో తొలి రోజు అమ్మకాల కన్నా మించిపోయాయని తెలిపింది. అనుబంధ సంస్థ మింత్రాలో కూడా తొలి గంటలో అధిక అమ్మకాలు నమోదైనట్లు పేర్కొంది

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *