ఒరిజినల్ ‘ఖాకీ’ కథ- సెల్యూట్ అనే మాట చిన్నది

తెలుగులో పర్వాలేదు అనిపిస్తోంది కాని తమిళ్ లో ఖాకీ సినిమా దుమ్ము దులుపుతోంది. ఎక్కడా టెంపో తగ్గకుండా నిజాయితీగా తెరకెక్కించిన పోలీస్ కథగా అందరి ప్రశంశలు పొందుతున్న ఈ సినిమా బాలేదు అనే మాట అయితే చూసిన ప్రేక్షకుల నుంచి రావడం లేదు. బేస్డ్ ఆన్ రియల్ స్టొరీ అన్నారు కాని నిజంగా స్ఫూర్తి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో మాత్రం చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం. తమిళనాడు బోర్డర్ లో గుమ్ముడిపూండి అనే ఊరు ఉంది.

ఒక దొంగల ముఠా అక్కడి ఎమెల్యేని దారుణంగా హత్య చేసి దోపిడీ చేసింది. ఆ ముఠాని పట్టుకోవడానికి మిషన్ బవారియాని స్టార్ట్ చేసింది పోలీస్ శాఖ. దీనికి నేతృత్వం వహించారు ఎస్ఆర్ జంగిద్. నేషనల్ వైడ్ పర్మిట్ లారీలలో సరుకు వేసుకుని తిరుగుతూ ఊరి బయట దూరంగా సంపన్నుల ఇళ్ళను టార్గెట్ చేసి దొంగతనాలు చేయటమే కాక దారుణ హత్యలకు పాల్పడే పలు గ్యాంగులు పోలీసుల దృష్టికి వచ్చాయి. కేవలం ఒక స్పాట్ లో దొరికిన బుల్లెట్స్, వేలిముద్రల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన టీంకి దీని అంతు చూడడానికి రెండేళ్ళు పట్టింది.

ఎక్కడెక్కడో తిరుగుతూ సరైన తిండి, నీరు లేక ఆరుబయట ప్రదేశాల్లో టెంట్లు వేసుకుని ఎండావానకు భయపడకుండా చాలా ధైర్యంగా ముందుకు సాగిన ఈ టీం ఫీల్డ్ లో చాలా సమస్యలు ఎదుర్కుంది. ముందు పర్దీస్ గ్యాంగ్ మీద అనుమానం వచ్చింది. కాని వాళ్ళు దొంగతనాలతో పాటు రేప్ కూడా చేస్తారు. కాని తమిళనాడులో జరిగిన వాటిలో రేప్ జరగలేదు.సో ఇది బవరియాల పనే అని తేలింది. అచ్చు సినిమాలో చూపించినట్టే ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా శోదించి దోషులను పట్టుకునే దాకా నరకం అనుభవించి మరీ జంగిద్ టీం వాళ్ళను పట్టుకుంది.

వినోత్ ఈ కథను ఆధారంగా చేసుకునే ఈ సినిమా తీసాడు. ఇటీవలే ఈ సినిమాని జంగిద్ కు చూపిస్తే ఆయన చూసి సినిమా ఉన్నదీ ఉన్నట్టు అద్భుతంగా తీసారని మెచ్చుకోవడం విశేషం. కార్తి మాట్లాడుతూ తాము కేవలం నటించామని, కాని నిజ జీవితంలో అతి క్రూరమైన ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి ఇంత తెగువ  చూపించిన జంగిద్ టీంకు సెల్యూట్ అనే మాట చిన్నది అని అన్నారు. నిజమే కదా. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో ఇంత పెద్ద కేసుని చేదించడం అంటే మాటలా

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *