ఇస్రో నెక్స్ట్ టార్గెట్ గ‌గ‌న్‌యాన్: కె శివన్

ఇస్రో చీఫ్ కే శివ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. చంద్ర‌యాన్‌2లోని ఆర్బిటార్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించలేపోయామని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టత్మంగా చేపట్టింది. సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి దింపే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల దానితో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి తిరిగి సంబంధాలు పునరుద్ధరించడానికి ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ విషయంలో నాసా కూడా ఇస్రోకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలను తిరిగి పునరుద్ధరించ లేకపోయామని తాజాగా శివన్ తెలిపారు. ఆర్బిటార్‌లో మొత్తం 8 ప‌రిక‌రాలు ఉన్నాయ‌ని, ప్ర‌తి ప‌రిక‌రం మెరుగ్గా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఇక త‌మ త‌దుప‌రి ల‌క్ష్యం గ‌గ‌న్‌యాన్ అని శివ‌న్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే గ‌గ‌న్‌యాన్ కోసం వ్యోమ‌గాముల ఎంపిక జ‌రిగింది. వారికి శారీర‌క శిక్ష‌ణ‌లు కూడా ఇస్తున్నారు. చివ‌రగా న‌లుగురు వ్యోమ‌గాముల‌కు ర‌ష్యాలోని స్పేస్ సెంట‌ర్‌లో ట్రైనింగ్ ఇవ్వ‌నున్నారు.

Videos