పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది‌.. అమేజింగ్‌

అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్‌ చిత్రం ’పద్మావతి’ . చారిత్రక నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ’పద్మావతి’గా దీపికా పదుకోన్‌ నటిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్‌ రాజ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌, విలన్‌ సుల్తాన్‌ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా.. 13.03 గంటలకు విడుదల చేశారు.

భన్సాలీ మార్క్‌ గ్రాండ్‌ విజువలైజేషన్‌.. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా సినిమా మలిచినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లో ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ భయానక రౌద్రరూపంతో ఆకట్టుకోగా.. అతనితో వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్‌, దీపిక అభినయం ట్రైలర్‌లో చూడొచ్చు.

ఈ సినిమా ట్రైలర్‌ను సరిగ్గా 13.03 గంటలకు విడుదల చేయడం వెనుక ఒక కారణముంది. చారిత్రకంగా సరిగ్గా 1303లోనే చిత్తోర్‌గఢ్‌పై అల్లావుద్దీన్‌ ఖిల్జీ దండయాత్ర విజయవంతమైంది.  గుహిలాసింగ్‌ రత్నసింహా (లేదా రతన్‌సింగ్‌) ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌ సేనతో ఎనిమిది నెలలు యుద్ధంచేసిన ఖిల్జీ.. చివరకు 1303లో ఈ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకసున్నాడు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా 13.03 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published.