పాక్ ఫ్యాన్స్ అత్యుత్సాహం: కోహ్లీని అవమానిస్తూ..

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెంబర్ 1 అయిన నేపథ్యంలో అత్యుత్సాహం కలిగి ఉన్న కొందరు అభిమానులు తమ దురహంగారాన్ని చూపారు. భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని, భారత జట్టును వెక్కిరించారు. టెస్ట్ క్రికెట్లో టీమిండియా నెంబర్ వన్ ర్యాంకును వారం రోజుల్లోనే, ఇటీవల కోల్పోయిన విషయం తెలిసిందే. వెస్టిండీస్, భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ర్యాంక్ చేజారింది. ర్యాంకింగ్స్ జాబితాలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి వెళ్లింది.

అంతకుముందు వారం శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 0-3తో ఓడిపోవటంతో భారత్ మొదటి స్థానానికి ఎకబాకింది. దీనిని కాపాడుకోవాలంటే భారత్ నాలుగో టెస్టు గెలవాల్సి ఉంది. వరుసగా నాలుగు రోజులపాటు వర్షం కారణంగా ఆట రద్దు కావడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో టెస్ట్ నెంబర్ వన్ ర్యాంక్ పాకిస్తాన్‌కు వెళ్లింది.

ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన కొందరు అత్యుత్సాహం కలిగిన అభిమానులు కొందరు పాక్ కెప్టెన్ మిస్పా ఉల్ హక్, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అందులో మిస్బాను కింగ్‌గా, కోహ్లీని సేవకుడిగా చిత్రీకరించారు. మరో ఫోటోలో మిస్బా పాక్ ఆటగాడు భారత ఆటగాడిని బాక్సింగ్ రింగులో ఓడించినట్లుగా చూపించారు.

ఈ ఏడాది ప్రారంభంలో మహేంద్ర సింగ్ ధోనీ, బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ ఫోటోలను ఇంటర్నెట్లో చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. టస్కిన్ అహ్మద్ తెగిన ధోనీ తలను పట్టుకున్నట్లుగా ఇమేజ్ చిత్రీకరించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Videos

One thought on “పాక్ ఫ్యాన్స్ అత్యుత్సాహం: కోహ్లీని అవమానిస్తూ..

Leave a Reply

Your email address will not be published.