‘ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌’తో పానాసోనిక్ టీవీలు…

ప్రముఖ  పానాసోనిక్ ‘డీఎక్స్’ సిరీస్‌లో తమ నూతన యూహెచ్‌డీ (అల్ట్రా హెచ్‌డీ) టీవీలను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఫైర్‌ఫాక్స్ ఓఎస్’ ఆధారంగా పనిచేసే ఈ సరికొత్త టీవీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. లైవ్‌టీవీ, యాప్స్, వ్యక్తిగత డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఈ నూతన టీవీ స్క్రీన్‌లను తీర్చిదిద్దారు.

వీటి ద్వారా వెబ్ యాప్స్, గేమ్స్, వార్తలు, కోరుకున్న వీడియోలు, వాతావరణ వివరాలు తదితర సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలుంది. ఇందుకోసం టీవీని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి వరకు ‘డీఎక్స్’ సిరీస్ టీవీల్లోని ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసి మరిన్ని ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నామని పానాసోనిక్ ప్రతినిధులు తెలియజేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *