అఫిషియల్ః పరిటాల శ్రీరామ్ పెళ్లికుదిరింది

ఆంద్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అనంతపూర్ నియోజకవర్గం గురించి తెలియని వారు ఉండరు. ఫ్యాక్షనిజం రాజకీయాలను తుడిచి పెట్టిన పరిటాల రవిని అక్కడ దేవుడిలా కొలుస్తారు. రాజకీయ రక్త చరిత్రలో మరణించిన పరిటాల రవికి ఇప్పటికి కూడా అభిమానులు ఉన్నారు. పరిటాల రవి స్థానంలో ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడిపుడే వారి కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నాడు.

మంత్రి పరిటాల సునిత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం విషయంలో గత కొద్దికాలంగా సాగుతున్న చర్చకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. శ్రీరామ్ వివాహం నిశ్చయమైందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఆయన తల్లి పరిటాల సునిత. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సునిత మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో తన పెద్ద కుమారుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఉంటుందని ప్రకటించారు.

ప్రముఖ AVR కన్ స్ట్రక్షన్స్ యజమాని వెంకటరమణ కూతురు ఆలం జ్ఞాన ని పరిటాల శ్రీ రామ్ కి ఇచ్చి వివాహం చేయడానికి ఫిక్స్ అయ్యారట. ఈ నెల 10న హైదరాబాద్ లో నిశ్చితార్థం నిర్వహించి  అక్టోబర్ 1న వివాహం జరుగనున్నట్లు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే

Videos

One thought on “అఫిషియల్ః పరిటాల శ్రీరామ్ పెళ్లికుదిరింది

  • January 18, 2020 at 8:50 am
    Permalink

    Propecia Absetzen Kinderwunsch Therapy Propecia Online Pharmacies Without Prescription order cialis online Viagra Professional Online Pharmacy

Leave a Reply

Your email address will not be published.