ఘనంగా పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. బంధుమిత్రులు హాజరై శ్రీరామ్-జ్ఞాన జంటను ఆశీర్వదించి, అభినందించారు.

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. స్పీకర్ కోడెల, మంత్రులు దేవినేని, అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ , ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీనేతలు పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల రవి అనుచరుడు చమన్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published.