ఏపీ రాజధానిని తరలించొద్దు: జనసేన అధినేత పవన్

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుండి తరలిస్తారు అని వస్తున్న వార్తలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి రాజధానిని తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్‌ వెల్లడించారు.

Videos