‘సర్దార్ గబ్బర్ సింగ్ ‘ సమస్య :రెమ్యునేషన్ వెనక్కి?

దాదాపు చాలా ఏరియాల్లో 50% పైగానే లాస్ వచ్చే అవకాసం ఉందని చెప్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్, వారి దగ్గర నుంచి ఎన్. జి పద్దతిలో తీసుకున్న ఎగ్జిబిటర్స్ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ కు ఎవరు భాధ్యత వహించి ఒడ్డున పడేస్తారు అనే డిస్కషన్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయి. బాహుబలి చిత్రం తర్వాత ఈ చిత్రానికే ఎక్కువ బిజినెస్ జరిగింది. 95 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని అంచనా.

దాంతో ఇప్పుడు ఈ లాస్ ఏ స్దాయిలో ఎవరు భరిస్తారు అనేది క్వచ్చిన్ గా కనపడుతోంది. నో గ్యారెంటి లెక్కలో తీసుకున్న ఎగ్జిబిటిర్స్ ..డిస్ట్కిబ్యూటర్స్ నిలదీస్తే..వారు పవన్ ని కలవక తప్పనిసరి పరిస్దితి. ఇంతకు ముందు రజనీకాంత్ పెద్ద డిజాస్టర్ చిత్రం లింగా సమయంలో ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. రజనీకాంత్ లింగా చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఓ అశోశియేషన్ గా ఏర్పడి…రజనీని, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ని కలవటం జరిగింది. ధర్నాలు వంటివి కూడా చేసారు. కాంపన్షేషన్ కోసం వారు పట్టుపట్టారు.

ఇప్పుడు అలాంటి పరిస్ధితి తెలుగులో వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. తెలంగాణా పంపిణీ దారుల సంఘం సెక్రటరీ టి వెంకట కృష్ణ మాట్లాడుతూ… మా దగ్గర అయితే ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ మా దగ్గర ఉన్న విశ్వనీయమైన సమాచారం ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్డిబ్యూటర్స్ చాలా పెద్ద ఎత్తున లాస్ అవుతారు అని చెప్పారు. తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇలా పెద్ద సినిమాలు ఈ స్దాయిలో ఫ్లాఫ్ అవటం వల్ల ఆ నష్టం వెళ్లి చిన్న సినిమాలపై పడుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ చిన్న సినిమా కొనే పరిస్ధితి ఉండదు.

డిస్ట్రిబ్యూటర్స్ లో చాలా మంది..నిర్మాత శరత్ మరార్ ని, పవన్ ని కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తాము సర్దార్ చిత్రం వల్ల నష్టపోయిన మొత్తాన్ని కాంపన్షన్ గా ఇప్పించమని అడిగాలని వారి ఆలోచన.
పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మీద వెనక్కి డబ్బు తిరిగి ఇమ్మని చెప్తారని, ఆయన నిజాయితీ పరుడు కాబట్టి తమకు ఈ నష్టం కలగనీయడని భావిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్.

ఇప్పుడు కాంపన్షేషన్ అంటే తాము నష్టపోయిన మొత్తం పూర్తిగా ఇస్తారా లేక రాక్ లైన్ వెంకటేష్..లింగా చిత్రానికి చేసినట్లు టెన్ పర్శంట్ ఇచ్చి దులుపుకుంటారనే ప్రశ్న అందరిలో మొదలుతోంది.

సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు తమ తదుపరి చిత్రంలో రికవరీ చేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ కు సర్దిచెప్తూంటారు నిర్మాతలు
ఇలాంటి సమస్య వస్తుందని పసిగట్టిన పవన్ ..వెంటనే ఎస్ జె సూర్యతో సినిమా ప్రకటించారంటున్నారు.

హిందీ వెర్షన్ ని 12 కోట్లు పెట్టి తీసుకున్న ఈరోస్ వారు సైతం ఈ ప్రాజెక్టుతో దాదాపు మొత్తం లాస్ అయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *