పవన్ కొడుకు.. మార్క్ శంకర్ పవనోవిచ్

మెగా ఫ్యామిలీలోనే కాదు.. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది సెపరేట్ స్టయిల్. ఆ ప్రత్యేకతే ఆయనకు ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. కేవలం యాక్షన్ లోనే కాదు.. చివరకు తన పిల్లలకు పేర్లు పెట్టడంలోనూ పవన్ తన ప్రత్యేకత చూపించాడనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అలాంటి  పేరు ఇంకెవరు పెట్టే అవకాశం లేని విధంగా పెట్టాడు.

పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నెవా దంపతులకు అక్టోబర్ 11న కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ చిన్నారికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరు పెట్టాడు. ఈ పేరులో శంకర్ అనేది పవన్ తన సోదరుడు చిరంజీవి పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శిస్తూ పెట్టింది కాగా.. పవనోవిచ్ అనేది రష్యన్ స్టయిల్ లో పవన్ కళ్యాణ్ పేరు. ఈ పేరులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మార్క్ అనేది క్రిస్టియన్ పేరు కాగా.. శంకర్ అనేది హిందూ పేరు. ఈ ఒక్క పేరుతో పవన్ తాను ఏ ఒక్క మతానికో పరిమితం కాదని చెప్పడమే కాదు.. అన్నయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేశాడు.

పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నెవా దంపతులకు ముందు ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు పోలినా అంజనా పవనోవా. తన తల్లి అంజనదేవి పేరునే కూతురికి కూడా పెట్టుకున్నాడు. పోలినా అనేది పవన్ భార్య లెజ్నెవా ఎంచుకున్న పేరు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ లకు ఒక మగపిల్లాడు – ఒక ఆడపిల్ల ఇసంతానం ఉన్నారు. వాళ్ల పేర్లు అకిరా నందన్ – ఆద్య. మొత్తానికి కొడుకు వైవిధ్యమైన పేరు పెట్టి పవన్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *