షాక్: కాట‌మ‌రాయుడు టైటిల్ సాంగ్ లీక్ (వీడియో)

టాలీవుడ్ ను లీకుల బాధ పట్టి పీడిస్తోంది. పెద్ద సినిమాల విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఈ లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. ప‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది సినిమా సైతం రిలీజ్‌కు ముందే ఫ‌స్టాఫ్ మొత్తం రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు సినిమా హిస్ట‌రీని మార్చేసిన బాహుబ‌లి సినిమా సైతం రిలీజ్‌కు ముందే లీక్ అయ్యింది.

ఇక బాహుబ‌లి 2 సినిమా షూటింగ్ అలా ముగిసిందో లేదో ఈ సినిమాలో వార్ సీన్లు సైతం అప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. పెద్ద సినిమాల విష‌యంలో చిత్ర యూనిట్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా లీకులు మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టాలీవుడ్‌కు మ‌రో షాక్ తగిలింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తూ, సెట్స్‌మీద ఉన్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు సినిమాలో టైటిల్ సాంగ్ అప్పుడే లీక్ అయిపోయింది. ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు సినిమాలో టైటిల్ సాంగ్ అంటూ 4 నిమిషాల నిడివి ఉన్న ఓ టైటిల్ సాంగ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ అవుతోంది.

అయితే ఈ పాట నిజ‌మైన టైటిల్ సాంగా కాదా అన్న‌దానిపై చిత్ర‌యూనిట్ నుంచి ఎలాంటి క్లారిపికేష‌న్ లేదు. సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఈ సాంగ్‌ను మీరు కూడా ఓ సారి ఈ క్రింద వీడియోలో వినండి.

Videos

Leave a Reply

Your email address will not be published.