నంద్యాల ఉపఎన్నికలో పవన్ సంచలన నిర్ణయం

నంద్యాల ఉప ఎన్నికలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని అందరూ భావిస్తుండగా.. తాను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. నంద్యాల, కాకినాడ ఉపఎన్నికల్లో తటస్థంగా ఉంటామని పవన్ పేర్కొన్నారు. తన మద్దతు ఉందని ఎవరైనా చెప్పుకుంటే అది తప్పని, జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తానే ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉపఎన్నిక కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ఆయన అన్నారు. పార్టీ నిర్మాణం జరిగే వరకూ ఏ ఎన్నికల్లో పోటీ చేయబోమని, 2019 ఎన్నికలే తమ టార్గెట్ అని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *