బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గోవాలో బీఫ్‌ను నిషేధించేది: పవన్‌ కల్యాణ్‌

గోమాతను పూజించాలని, గౌరవించాలని సెంటిమెంట్‌ను ప్రేరేపిస్తున్న బీజేపీకి ఆ అంశంపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ పాలనలోని గోవాలో బీఫ్‌ను నిషేధించి ఉండేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చిన తమ పార్టీ.. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశాలపై కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వానికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటోందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వీటన్నిటిపైనా తాను పలువురు మేధావులు, సీనియర్‌ రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో చర్చించినట్టు పేర్కొన్నారు. గోవధ, బీఫ్‌ నిషేధంపై చేస్తున్న రాజకీయం.. బీఫ్‌ తినేవారిలో భయాందోళనలు రేకెత్తించడం, తిననివారిలో సెంటిమెంట్‌ను ప్రేరేపించే వ్యూహంగా ఆరోపించారు. ఒకవేళ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. ఆ పార్టీ పాలనలోని గోవాలో బీఫ్‌ను నిషేధించి ఉండేదని పేర్కొన్నారు. అలాగే.. తోలుతో తయారుచేసిన బెల్టులు, చెప్పులవంటివాటిని తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడకుండా నిషేధం విధించి ఉండేదన్నారు. గోమాతను సంరక్షించేందుకు.. ప్రతి కార్యకర్తా ఒక ఆవును దత్తత తీసుకోవాలనే నిబంధన తెచ్చి ఉండేదన్నారు. ఇక రోహిత్ ఆత్మహత్యపై శుక్రవారం పోస్ట్‌ చేస్తానని పవన్‌ ట్వీట్‌ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published.