‘సర్దార్..’ లేటెస్ట్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రిలీజ్‍ టైమ్‌కు దగ్గరవుతున్నాకొద్దీ సినిమాపై ఉన్న అంచనాలు రోజురోజుకీ రెట్టింపు అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌లకు వచ్చిన రెస్పాన్స్ కూఈ స్థాయి అంచనాలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని చెబుతూ వస్తోన్న టీమ్, ముందే ప్రకటించినట్లుగా ఏప్రిల్ 8నే సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది.

ఇలాంటి టైంలో పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపే అప్ డేట్ తో ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు శరత్ మరార్. నిన్న అర్ధరాత్రి దాటాకా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్ లోని ఒక ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు శరత్. పవన్ వైట్ షర్ట్ – గాగుల్స్ తో కుర్చీలో కూర్చుని వెనక్కి తిరిగి పోజిస్తుంటే.. అతడి ముందు కింద కూర్చుని కానిస్టేబుల్ డ్రెస్సుల్లో కెమెరా వైపు చూస్తున్నారు ఆలీ – బ్రహ్మాజీ – వేణు – షకలక శంకర్ తదితరులు. ‘‘సర్దార్ గబ్బర్ సింగ్ అతడి కానిస్టేబుళ్లు కలిసి ఏప్రిల్ 8న బ్లాక్ బస్టర్ రిలీజ్ కోసం శాయశక్తులా కష్టపడుతున్నారు’’ అంటూ ఈ ఫొటోకు కామెంట్ కూడా జోడించాడు శరత్. కాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏప్రిల్ 8 మీదే ఆశలు పెట్టుకోవచ్చన్నమాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *