బిగ్‌బీతో పవన్ కల్యాణ్.. సైరా షూటింగ్ ఫోటో లీక్.

సినిమా షూటింగ్స్ లో జరిగే కొన్ని స్పెషల్ మూమెంట్స్ అప్పటికప్పుడు బయటికి రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు తెలిసినప్పుడు మాత్రం టైంతో సంబంధం లేకుండా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిదే ఇక్కడి పిక్ కూడా. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సం సందర్బంగా ఈ నెల 21న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుండగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెట్‌ను సందర్శించిన ఫొటో బయటకు లీకై సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

సైరా నర్సింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి గురువుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా పవన్ కల్యాణ్ వెళ్లి బిగ్‌బీ అమితాబ్‌ను కలుసుకొన్నారు.ఇది సుమారు రెండు మూడు నెలల క్రితం తీసుకున్న ఫోటోగా అర్థమవుతోంది. సత్యానంద్ కు ప్రత్యేకంగా చిరు దీన్ని ఫ్రేమ్ చేయించి మరీ పంపారట. ఇన్ని రోజుల తర్వాత  దీన్ని షేర్ చేసుకున్నా  ఆన్ లైన్ లో ఇది హల్చల్ చేస్తోందంటే మెగా క్రేజ్ ఎంతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Videos

795 thoughts on “బిగ్‌బీతో పవన్ కల్యాణ్.. సైరా షూటింగ్ ఫోటో లీక్.

Leave a Reply

Your email address will not be published.