మేం అడగలేదు.. పవన్ కల్యాణే వచ్చి మద్దతిచ్చాడు: చంద్రబాబు

గత ఎన్నికల నాటి పరిణామాల గురించి స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఊహించని రీతిలో విజయం సాధించుకు వచ్చిన ఆ ఎన్నికల గురించి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడా? తెలుగుదేశంతో కలిసి బరిలోకి దిగుతాడా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ చంద్రబాబు ఒకింత సంచలన వ్యాఖ్యలనే చేశాడు.

ఇంతకీ చంద్రబాబు ఏమన్నాడంటే.. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికాడు అని వ్యాఖ్యానించాడు. తాము పవన్ కల్యాణ్ మద్దతును అడగలేదు , ఆయనే తమకు వచ్చి మద్దతు ప్రకటించాడు.. అని తెలుగుదేశం అధినేత చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి అప్పుడు ఏం జరిగిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబు మద్దతును కోరాడు.

పవన్ కోసం చంద్రబాబు చాలా సేపు వేచి చూశాడు కూడా. తెలుగుదేశం పార్టీ గెలవడం కల్ల అని, వైకాపా విజయదుందుభి మోగిస్తుందనే ఊహాగానాలున్న తరుణంలో చంద్రబాబు వెళ్లి పవన్ ప్రాపకం కోసం ప్రయత్నించాడు. పవన్ ను తన మద్దతుదారుగా మార్చుకున్నాడు. అయితే ఇప్పుడేమో మేము అడగలేదు, పవన్ కల్యాణే వచ్చి మద్దతును ఇచ్చాడు.. అని బాబు చెప్పుకొంటున్నాడు. మరి ఎన్టీఆర్ విషయంలోనే బాబు ఎన్నో సార్లు మాట మార్చాడు.. ఇక పవన్ కల్యాణ్ ఎంత?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *