జగన్ ధైర్యానికి పవన్ కితాబులు..ఇంట్రస్టింగ్!

ఇప్పటికే చాలా మంది చెబుతున్నారు.. జగన్ ధైర్యవంతుడు అని, అంతేగాక జగన్ అబద్ధం చెప్పడు అని కూడా ఇటీవలే ఒక స్వామీజీ చెప్పారు. విశాక శారద పీఠాధిపతి అదే విషయాన్ని చెప్పాడు. జగన్ అబద్ధం చెప్పే టైపు కాదు అని.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి జగన్ అని స్వరూపనందేంద్ర వ్యాఖ్యానించారు. ఒక మీడియా ఇంటర్వ్యూ లో ఆయన జగన్ ను ఆ విధంగా ప్రశంసించాడు.

ఇక వైకాపాలో పని చేసిన వాళ్లు కూడా తరచూ ఇదే మాటే చెబుతూ ఉంటారు. జగన్ ఏదైనా సూటిగా చెబుతాడు, చేయగలిగితే చేస్తానంటాడు లేకపోతే లేదని అంటాడు అని వారు చెబుతూ ఉన్నారు. ఊరికే హామీలు ఇవ్వడం, మోసం చేసేలా మాట్లాడటం జగన్ నైజం కాదు అని వారు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

ఇక ఇప్పుడు.. జగన్ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. జగన్ ధైర్యాన్ని పవన్ కూడా ప్రశంసించాడు. జగన్ కు వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. జగన్ మీద అనుచితంగా కూడా మాట్లాడాడు పీకే. అయితే.. ఇప్పుడు మాత్రం జగన్ తెగువను ధైర్యాన్ని పవన్ ప్రశంసించాడు. ‘జగన్ మోహన్ రెడ్డి దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి.. ’ అని పవన్ అన్నాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు అదే మాటే చెప్పాడు. మరి ప్రత్యర్థుల చేత కూడా ఇలా అనిపించుకోవడం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి చేవకు నిదర్శనం అని చెప్పాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *