చరణ్ కి రాఖీ కట్టిన పవన్ కూతురు…

పవన్ కళ్యాణ్, చిరంజీవి అన్నదమ్ములుగానే కాదు టాలీవుడ్ లో అద్దిరిపోయే చరీష్మా ఉన్న అగ్ర నటులు కూడా. అంతే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇద్దరూ కీలకంగా ఉన్న నాయకులు కూడా…. ఈ ఇద్దరూ అటు అభిమానులకీ ఇటు సామాన్య జనానికీ పజిల్ గానే ఉంటున్నారు. ఒక రోజు ఇద్దరూ ఎడమొకం పెడమొహం లా ఇన్ డైరెక్ట్ గా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు… మరో రోజు ఇద్దరూ కలిసి పోయినట్టే కనిపిస్తారు… ఇద్దరిమధ్యా ఉన్న సఖ్యత గురించి జనాలు ఒక నిర్ణయానికి రావటమే తప్ప ఏనాడూ పవన్ గానీ చిరు గానీ నోరు విప్పలేదు…

అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములూ నిజంగానే దూరమయ్యారా..? లేక అవన్నీ అపోహలేనా..? మరైతే మెగా కుటుంబంలో జరిగే ఫంక్షన్లలో పవన్ ఎందుకు కనిపించటం లేదు..?? మెగా హీరోలలో అందరూ పవన్ కళ్యాన్ మాటే రాకుండా జాగ్రత్త పడుతున్నారు…, అటు పవన్ కూడా ఏ విషయం లోనూ తాను మెగా ఫ్యామిలీలో ఇప్పటికీ ఒక పార్ట్ అన్న విషయాన్ని ఎక్కడా దృవీకరించటంలేదు… అయితే ఈ మధ్య జరిగిన ఒక చిన్న విషయం… ఈ విషయం లో పెద్ద క్లారిటీనే ఇచ్చింది. పవన్ విషయం లో మెగా ఫ్యామిలీ ఏదో చిన్న చూపుతో ఉందనేదు వాస్తవం కాదని అర్థమయ్యే సంగతే అది. రామ్ చరణ్.., పవన్ కూతురు పోలెనా తో రాఖీ కట్టించుకున్న ఫొటో ఇప్పుడు అభిమానుల్లో బాగా షేర్ అవుతోంది…

ఫోటోలో పొలేనా, రామ్ చరణ్ చేతికి రాఖీ కడుతూ ఉంటే చరణ్ చెల్లెలుతో నవ్వుతూ కనిపించడం స్పష్టంగా కనిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *