మరోసారి తండ్రి కానున్న పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 45వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. పవన్ త్వరలోనే మరోసారి తండ్రి కాబోతున్నాడట. పవన్ భార్య అనా లెజ్‌నెవా రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం.

లెజ్‌నెవా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అట. ఆమె అక్టోబరు మధ్యలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన పవన్.. త్వరలోనే ఇంటికి తిరిగి రానున్నాడట. బిడ్డను ప్రసవించే సమయంలో భార్య వెంటే ఉంటాడట.

పవన్‌కు ఇది నాలుగో సంతానం కావడం విశేషం. పవన్ ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తండ్రి. తన మాజీ భార్య రేణు దేశాయ్‌తో అతడికి ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. వాళ్లే.. అకిరా నందన్, ఆద్య. లెజ్‌నెవా‌ కూడా పవన్‌తో పెళ్లయ్యాక ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. పవన్‌కు ఈమె మూడో భార్య అన్న సంగతి తెలిసిందే. ‘తీన్ మార్’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించిన లెజ్‌నెవాతో ఆ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డాడు పవన్.

అప్పటికే పవన్.. రేణు నుంచి విడిపోయి ఉన్నాడు. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత లెజ్‌నెవాను పవన్ పెళ్లి చేసుకున్నాడు. లెజ్‌నెవా మెగా ఫ్యామిలీ వేడుకలకు అప్పుడప్పుడూ హాజరై మీడియా దృష్టిలో పడింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *