ప‌య్యావుల ఆశ‌ల‌పై బాల‌య్య నీళ్లు!

ఏపీలో కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు వెళ‌తారు? అన్న‌దానిపై విస్త్ర‌తంగా చ‌ర్చ‌సాగుతోంది. ఓ ప‌దిమంది ఇన్ అయితే, ఐదారుగురు మాత్రం అవుట్ అయ్యే జాబితాలో ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు. అయితే పోతాం అనుకునేవారి కంటే ఉంటాం అనుకుంటూ మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌తో ఉన్న‌వారి జాబితా పెద్ద‌దే ఉంది. లోకేష్ కేబినెట్ బెర్త్ ఖాయ‌మైంది. ఇక ఆ త‌ర్వాతి నంబ‌ర్‌2 గా భూమా త‌న‌య అఖిల‌ప్రియ‌కు క‌న్ఫామ్ అయిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

ఇక రాయ‌ల‌సీమ వ‌ర‌కూ వెళితే అనంత‌పురం జిల్లా నుంచి ప‌దవి ఆశిస్తున్న‌వారిలో సీనియ‌ర్ నేత పయ్యావుల కేశ‌వ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. 2004, 2007 రెండుసార్లు గెలిచి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ప్ర‌త్య‌ర్థిపై అలుపెర‌గ‌కుండా పోరాడాను. అందుకు ప్ర‌తిగా ఇప్పుడు కేబినెట్ బెర్గ్ ఖాయం చేయాల్సిందేన‌ని బాబుపై ఒత్తిడి తెస్తున్నారుట‌. అయితే ప‌య్యావుల‌కు అనంత‌పురంలో పోటీ ఉంది. ప‌రిటాల సునీత‌ను కాద‌నే ధైర్యం బాబుకు లేదు. ఎందుకంటే ప‌రిటాల సునీత‌కు నంద‌మూరి బాల‌కృష్ణ స‌పోర్టు ఉంది. బావ‌మ‌రిది వేలు పెడితే కాద‌ని బాబు అన‌గ‌ల‌రా? అందుకే ప‌య్యావుల ఆశ‌ల‌కు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ నీళ్లు చ‌ల్లిన‌ట్టేన‌ని చెప్పుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *