ప్రశంసలు అందుకున్న మోడి చేసిన పని

రష్యాలోని  వ్లాదివోస్తోక్ లో జరుగుతున్నా తూర్పు ఆర్ధిక వేదిక 5వ సదస్సు లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విషయానికి వస్తే సమావేశాల అనంతరం జరిగిన ఓ ఫోటో సెషన్ లో మోదీ కోసం ప్రత్యేకంగా ఓ సోఫాను ఏర్పాటు చేశారు. అయితే మోదీ దానిపై కూర్చోడానికి నిరాకరించారు. దానిని వెంటనే తొలగించి అనాదరికి వేసిన కూర్చిలే తనకు వేయాలని సూచించారు. దీనితో వెంటనే అధికారులు సోఫాను తొలగించి అందరికీ వేసిన కూర్చినే ఆయనకు వేశారు.ఈ సంఘటనకు సంబంధీన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మధ్యమంలో పోస్ట్ చేశారు. దీనితో ఇది వైరల్ గా మారింది. మోదిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించిన మోదీ వ్లాదివోస్తోక్ లో జరుగుతున్నా తూర్పు ఆర్ధిక వేదిక 5వ సదస్సు పాల్గొన్న విషయం తెలిసిందే.

Videos