మోదీకి ఘనా స్వాగతం పలికిన రష్యా

ద్వైపాక్షిక సమావేశాల కోసం రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా చేరుకున్న ప్రధాని మోదీకి భుధవరం అక్క్ది అధికారులు ఘనా స్వాగతం పలికారు. రష్యాలోని తూర్పు తీరంలోని అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్ళిన తొలి భారత ప్రధాని మోదీ. ఈ పర్యటనలో తూర్పు దేశాల ఆర్ధిక సదస్సుతోపాటు భారత-రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ తో కీలక సమావేశం జరగనుంది. ఈ పర్యటనలో మొత్తం 25 ఒప్పందలపై సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ పర్యటనలో పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకరంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనతో రష్యాతో ఉన్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Videos