షాకింగ్‌ : ప్రభాస్‌కి డ్రగ్స్ మరక..!

బాహుబలి సినిమా ప్రభాస్‌ను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌ జనాలకు మన ప్రభాస్‌ తెగ నచ్చేశాడు. అక్కడి స్టార్‌ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రభాస్‌. అందుకే ప్రభాస్‌ గురించి పాయింట్‌ టు పాయింట్‌ కథనాలు వండి వడ్డిస్తోంది బాలీవుడ్‌ మీడియా.

అయితే, ప్రస్తుతం డ్రగ్స్ అంశం టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. తాజాగా ఈ లిస్టులో రెబల్ స్టార్ ప్రభాస్‌ పేరు ఉందన్న వార్తలు షికార్ చేస్తున్నాయి. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సినిమా సినిమాకి వైవిధ్యాన్ని  ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్ధాయిలో ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సినిమాలు తీసేందుకు దర్శక,నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదంతా నాణానికి ఒక వైపు.

మరోవైపు ప్రభాస్ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో డ్రగ్స్‌కు బాగా ఆకర్షితుడయ్యాడట. పూరి జగన్నాథ్‌తో బుజ్జి సినిమా తీస్తున్న సమయంలో వీరిద్దరు మత్తు జగత్తులో తేలియాడేవారట. ప్రభాస్‌కి పూరి జగన్నాథ్‌ డ్రగ్స్ అలవాటు చేశాడని.. ఆ సినిమా సమయంలో డ్రగ్స్ మత్తులో బ్యాంకాక్ హోటల్ లో నగ్నంగా తిరిగారనే వార్తలు కొన్ని వెబ్ సైట్లలో షికార్లు చేస్తున్నాయి..

దీంతో కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులు ప్రభాస్‌ను తీవ్రస్దాయిలో మందలించారని ఇక  అప్పటినుంచి ప్రభాస్‌ తనకున్న అలవాటును వదిలేసి సినీ కెరీర్‌పై దృష్టిసారించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చిన వారిలో ఓ టాప్‌ హీరో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ప్రభాస్‌కి సంబంధించిన పేరు తెరమీదకు వచ్చింది. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో పలు వెబ్ సైట్లలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *