ప్రభాస్ పెళ్ళి.. రాశి వారి అమ్మాయితో?

ఇప్పుడు ప్రభాస్ పెళ్ళి టాపిక్.. సల్మాన్ ఖాన్ పెళ్ళి టాపిక్ కంటే పాపులర్ అయిపోయింది. ఎందుకంటే మనోడు బాహుబలి 2 సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు కాబట్టి.. అందరూ దీని గురించే డిస్కషన్లు చేస్తున్నారు. ఒక ప్రక్కన జ్యోతీష్యులు అందరూ వచ్చే మార్చి 2018లోగా ప్రభాస్ పెళ్లి అయిపోతుందని ప్రెడిక్షన్లు చెబుతున్న వేళ.. ఇప్పుడు మరో హాట్ న్యూస్ వచ్చిందండోయ్.

నిజానికి ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుండి.. అతగాడి కమ్యూనిటీకి చెందిన పెద్దల పిల్లల పేర్లన్నీ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంగ్లీష్ పత్రిక రివీల్ చేసిన దాని ప్రకారం.. రాశి సిమెంట్స్ ఓనర్ అయిన భూపతి రాజు మనవరాలితో ప్రభాస్ పెళ్లి జరిగే ఛాన్సు ఉందంటున్నారు. ఆల్రెడీ ప్రభాస్ తరుపున కృష్ణంరాజుతో రాశి సిమెంట్స్ వారు చర్చలు జరుపుతున్నారు. జాతకాలు కలసి.. అభిరుచులు మిక్స్ అయితే.. వెంటనే పెళ్ళి ఉండే ఛాన్సుందని టాక్. అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా తన సమయాన్ని హాలిడేకి కేటాయించడంతో.. మనోడు ఎప్పుడు ఇండియా వచ్చి ఈ విషయంపై డెసిషన్ తీసుకుంటాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇకపోతే ఇండియా రాగానే ఓ 10 రోజులు బ్రేకిచ్చి.. వెంటనే ముంబయ్ లో సాహో సినిమా షూటింగ్ మొదలెట్టేస్తారని కూడా టాక్. ఆ తరువాత మనోడు అబు దాబిలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. అది సంగతి.

Videos

Leave a Reply

Your email address will not be published.