తమన్నా.. అతడితో పీకల్లోతు ప్రేమలో..?

దశాబ్ద కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నా ఇంత వరకూ పెద్దగా ప్రేమ వ్యవహారాల్లో తన పేరు వినిపించకుండా చూసుకుంది తమన్నా భాటియా. చాలా మంది హీరోయిన్లు తరచూ ఏదో ఒక ప్రేమకథతో వార్తల్లోకి వస్తున్నా, తమన్నా మాత్రం వాటికి దూరదూరంగానే ఉంటోంది. అయితే ఇప్పుడు మాత్రం ఒక ప్రేమకథలో ఈ హీరోయిన్ పేరు వినిపిస్తూ ఉండటం విశేషం.

ప్రభుదేవాతో తమన్నా ప్రేమయాణం అనే వార్త బాగా ప్రచారానికి నోచుకుంటోంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. తమన్నా తో ప్రేమాయణం కోసమే త్వరలో ప్రభుదేవా ఒక సినిమాను రూపొందిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. ఆ మధ్య ‘అభినేత్రి‘ అని ఒక ప్లాఫ్ సినిమా వచ్చింది కదా.. దానికి సీక్వెల్ ను తీయబోతున్నాడట ప్రభుదేవా. మరి ప్లాఫ్ సినిమాకు సీక్వెల్ ఏమిటి? అంటే.. అదే మరి ప్రభు, తమన్నాల సాన్నిహిత్యానికి నిదర్శనం అని వీళ్లను ఎరిగిన వాళ్లు అంటున్నారు.

ఆ దర్శకుడు, ఈ హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. తమన్నా తో కలిసి పని చేసుకుంటూ, ప్రేమించుకోవడానికి ప్రభుదేవా అభినేత్రికి సీక్వెల్ ను తీయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ప్రభుకు ప్రేమా కొత్త కాదు, హీరోయిన్లూ కొత్త కాదు. వెనుకటికి నయనతారతో ఇతడి ప్రేమకథ బాగానే ప్రచారానికి నోచుకుంది. మరి తమన్నాతో వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో!

Videos

Leave a Reply

Your email address will not be published.