14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం

భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్…కోవింద్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్‌ ముఖర్జీ… కోవింద్‌కు అభినందనలు తెలిపారు.

భార‌త రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ప్రెసిడెంట్ రామ్‌నాథ్ అన్నారు. దేశ ప్ర‌జ‌లకు సేవ చేస్తాన‌ని కూడా ఆయ‌న శ‌ప‌థం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత అన్న కోవింద్…సమాజ అభ్యున్నతికి అందరు కృషి చేయాలన్నారు. 125 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని నిలబెడతానని … మహానీయుల అడుగు జాడల్లో నడుస్తానని తెలిపారు.

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేముందు జాతిపిత మహాత్మాగాంధీకి నివాళుల్పించారు కోవింద్‌.  సతీమణి సవితతో కలిసి తన నివాసం నుంచి రాజ్‌ఘాట్‌ వెళ్లిన కోవింద్‌.. మహాత్ముడి స్మారకస్థూపం వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు.

కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,చంద్రబాబుతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా రామ్ నాథ్ నిలిచారు.

రాష్ట్రపతి ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్  విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై  65.6శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. 1945, అక్టోబ‌ర్ 1న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో జ‌న్మించారు కోవింద్. రాజకీయాల్లో వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అడ్వ‌కేట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన ఆయన ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వ‌ర‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్వ‌కేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వ‌ర‌కు ఆయ‌న సుప్రీంకోర్టులో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయ‌న సుప్రీంకోర్టులో అడ్వ‌కేట్‌-రికార్డ్‌గా ప‌నిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయ‌న 16 ఏళ్లు ప‌నిచేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *