నటుడు పృథ్వీ రాజ్ ‘సూసైడ్’ వీడియో సంచలనం

హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది నటుడు బబ్లూ పృథ్వీ రాజ్‌కు చెందిన ‘సూసైడ్’ వీడియో సోషల్ మీడియాలో సంచలనంలా వ్యాపిస్తోంది. అయితే ఈ వీడియోలో పృథ్వీరాజ్ తొలుత చేతి మనికట్టు చాకుతో కోసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు కనిపించడంతో అంతా షాకయ్యారు. అయితే ఇది ఆత్మహత్యలు అరికట్టడానికి, అవగాహన కల్పించడానికి తీసిన వీడియో అని చివర్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 6 నిమిషాల 50 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ఆత్మహత్యలు వద్దు, సూసైడ్ సమస్యలకు పరిష్కారం కాదు అనే సందేశం ఇచ్చారు.

ఈ మధ్య కాలంతో టీవీ రంగానికి ప్రత్యూష బెనర్జీ, తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్యలకు పాల్పడ్డ నేపథ్యంలో ఇలాంటి మళ్లీ జరుగకుండా, అలాంటి ఆలోచనలు ఉన్న వారిలో అవగాహన కల్పించడానికి ఈ వీడియో రూపొందించారు.

వీడియో చివర్లో…మీ స్కిర్ పేపర్ కాదు…దానిని కట్ చేయొద్దు, మీ ముఖం మాస్క్ కాదు… దాన్ని దాచొద్దు, మీ జీవితం సినిమా కాదు..దాన్ని ముగించొద్దు. అంటూ సందేశం ఇచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *