వీడియో: ప్రియాంక చోప్రా హాట్ లిప్‌లాక్!

ఏమాత్రం గ్యాప్ లేకుండా వార్తల్లోకి వస్తోంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ అవకాశాలతో, ఆపై ప్రేమాయణంతో, ఆ వెంటనే నిశ్చితార్థం, బాలీవుడ్ సినిమా భరత్ నుంచి తప్పుకోవడం.. ఇలా గ్యాప్ లేకుండా ప్రియాంక వార్తల్లోకి వస్తోంది. వీటన్నిటితో పాటు తాజాగా ప్రియాంక హాట్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. క్వాంటికో 3కి సంబంధించిన వీడియో ఇది. అందులో తన సహనటుడితో ప్రియాంక చేసిన హాట్ రొమాన్స్ వీడియో వైరల్‌గా మారిందిప్పుడు.

ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రమ్ పోస్టు వైరల్‌గా మారింది. ప్రియాంక ఫ్యాన్ పేజీ వాళ్లెవరో వీడియోలను షేర్ చేశారు. అయితే ఆ క్వాంటికో నటుడితో ప్రియాంక ఘాటు రొమాన్స్ చేయడం కొత్త ఏమీకాదు. గతంలో కూడా వీరిద్దరూ లిప్‌లాక్స్‌లో మునిగితేలారు. అయినప్పటికీ వీరి తాజా హాట్ రొమాన్స్ నెటిజన్లకు కిక్ ఎక్కిస్తోంది.

ఇప్పటికే ఎంగేజ్డ్ అయ్యింది ప్రియాంక. తనకన్నా వయసులో చాలా చిన్నవాడు అయిన నిక్ జోనస్‌ను ఆమె పెళ్లాడటం ఖాయమే అనుకోవాలి. పెళ్లి కోసమే ఈమె సల్మాన్ ఖాన్ సినిమా ‘భరత్’ నుంచి తప్పుకుందనే వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి కోసం కాదు, హాలీవుడ్‌లో వచ్చిన అవకాశం కోసం ఈమె భరత్ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది.

వీడియోకి క్లిక్ చేయండి

Videos

Leave a Reply

Your email address will not be published.