బాలయ్య సినిమా.. పూరి ఇలా షాకిచ్చాడేంటో

నందమూరి బాలకృష్ణతో సినిమా అంటేనే వ్యవహారం వేరుగా ఉంటుంది. కో ఆర్టిస్టులందరినీ చాలా వరకు అనుభవజ్నుల్నే తీసుకుంటారు. ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్లనే ఆయనకు జోడీగా ఎంచుకుంటారు. ఐతే బాలయ్య తర్వాతి సినిమాకు దర్శకత్వం వహించబోతున్న పూరి జగన్నాథ్ మాత్రం ఏదో కొత్త నటీనటులతో తీసే సినిమాకు ఇచ్చినట్లుగా కాస్టింగ్ కాల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ సినిమాలో మొత్తం 14 పాత్రల కోసం పూరి-ఛార్మి కలిసి ఏర్పాటు చేసిన ‘పూరి కనెక్ట్స్’ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఇద్దరి వయసు 23-30 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. విలన్ ఆరడుగుల ఎత్తు ఉండాలట. వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండాలట. ఇందులో ఓ యువ జంటను కూడా నటింపజేయాలని భావిస్తున్నట్లుంది. 25-30 ఏళ్ల మధ్య కుర్రాడు.. 22-25 ఏళ్ల మధ్య అమ్మాయి కావాలన్నారు. అలాగే పొలిటీషియన్ పాత్రకు సూటయ్యే 45-50 ఏళ్ల మధ్య వయసున్న నటుడు కూడా కావాలన్నారు.

బాలయ్య లాంటి పేరున్న హీరో సినిమాకు ఇలా కాస్టింగ్ కాల్ ద్వారా నటీనటుల్ని ఎంపిక చేయడమేంటా అని ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మామూలుగా పెద్ద హీరోల సినిమాలకు ముంబయి కన్సల్టన్సీలు.. ఏజెంట్ల ద్వారా ఆర్టిస్టులను తెప్పించుకుంటారు. అక్కడి స్టూడియోలకు వెళ్లి ప్రొఫైల్స్ చూసి నచ్చిన వాళ్లను ఎంచుకుంటుంటారు. లేదా సౌత్ లోని వేరే ఇండస్ట్రీల్లో ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టుల్ని పాత్రలకు తగ్గట్లుగా ఎంచుకుంటారు. అలా కాకుండా కొత్త వాళ్లతో చేస్తున్న సినిమాల తరహాలో ఇలా కాస్టింగ్ కాల్ ఇవ్వడం ఆశ్చర్యకరం. మరి ఈ విషయంలో బాలయ్య రెస్పాన్స్ ఏంటో?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *