‘రిపోర్టర్ బాలకృష్ణ’గా కళ్యాణ్ రామ్

పటాస్’ సినిమాతో హీరోగా వచ్చిన కమర్షియల్ స్టేటస్‌ను ఆ తర్వాత వచ్చిన ‘షేర్‌’తో అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్, తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్లో ఇప్పటివరకూ పూరీ స్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కళ్యాణ్ రామ్, ఈ సినిమా కోసం ఓ సరికొత్త లుక్‌ను ట్రై చేసి ఆశ్చర్యపరిచారు. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది.

జూలై 4న అంటే.. రేపే ఈ టైటిల్ ని ప్రకటించే ఛాన్స్ ఉంది. జూలై 4కు ఫిక్స్ అవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ రోజున కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు కావడంతో.. నందమూరి అభిమానులకు తన టైటిల్ తో గిఫ్ట్ తో పాటు షాక్ కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారట. . ఇదిలా ఉంటే అభిమానుల ప్రచారాన్ని బట్టిచూస్తే, ఈ సినిమాకు ‘రిపోర్టర్ బాలకృష్ణ’ అనే పేరును ఖరారు చేశారని వినిపిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తారని, ఈ పేరైతే అన్నివిధాలా బాగుంటుందని పూరీ ఈ పేరు పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా టైటిల్ ఇదేనా? ఇంకేదైనా? తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే!

Videos

Leave a Reply

Your email address will not be published.