చైనా ఓపెన్ నుంచి ప్రపంచ ఛాంపియన్ సింధు నిష్క్రమణ

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో పోర్న్‌ పావే చూచూవోంగ్‌(థాయిలాండ్‌) చేతిలో పరాజయం చెందారు.

చైనాకి చెందిన లీ జురుయ్‌ని 21-18, 21-12 తేడాతో బుధవారం వరుస సెట్లలో ఓడించి ప్రీక్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పీవీ సింధు ఈరోజు కూడా తొలి సెట్‌లో చోచువాంగ్‌పై అదే జోరుని కొనసాగించింది. ఈ క్రమంలో 21-12 తేడాతో అలవోక సెట్‌ని చేజిక్కించుకుంది. కానీ.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలోనూ ఈ భారత షట్లర్ తడబడింది. దీంతో.. రెండో సెట్‌ని 21-13 తేడాతో థాయ్‌లాండ్ షట్లర్ గెలుపొందగా.. విజేత నిర్ణయాత్మక మూడో సెట్‌ హోరా హోరీగా జరిగింది. అయితే.. మూడో సెట్‌ ఆఖర్లో చిన్న తప్పిదాలు చేసిన సింధు.. 19-21 తేడాతో ఓడిపోయింది.

Videos