ఏపీ సిఎం కలిసిన పి.వి.సింధు

బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ తెలుగు తేజం పీవీ సింధు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Videos