ఆర్.నారాయణమూర్తి కోసం పార్టీలు క్యూ..?

నమ్మిన సిద్ధాంతం కోసం సినిమాలు తీస్తూ నష్టాలొచ్చినా భరిస్తూ లాభాలొస్తే ఆ డబ్బుతో మంచి పనులు చేసే సినీ నటుడు – దర్శకుడు – నిర్మాత – రచయిత.. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ బహురూపి ఆర్.నారాయణమూర్తి కోసం చాలాకాలంగా పార్టీలు క్యూ కడుతున్నాయట. అయితే ఆయన మాత్రం అందుకు నో చెప్తున్నారట.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీచేయాలంటూ మూడుసార్లు ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు.  అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇస్తామని చెప్పిందని మొన్న కూడా ఒక పార్టీ ఆఫర్ ఇచ్చిందని తాను ఓ దండం పెట్టానని నారాయణ మూర్తి అన్నారు. రాజకీయాల్లోకి వెళితే ప్రజల కోసం 24 గంటలు పనిచేయాలని లేకపోతే వెళ్లకూడదని అన్నారు. తనకు సినిమా పిచ్చి మాత్రమే ఉందని అన్నారు. రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణించకూడదని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ అప్పట్లో ఓ హిస్టరీ క్రియేట్ చేశారని అన్నారు. ఎన్టీఆర్ తరువాత అంతటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మళ్లీ వైఎస్.రాజశేఖర్ రెడ్డని అన్నారు.  తమ ఊరిలో మొదటిసారి బీఏ చదివింది తానేనని ఆర్.నారాయణమూర్తి అన్నారు. తనకు కమ్యూనిజం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని చెప్పారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తనకు ఒక భగవద్గీతలా అనిపించిందని అన్నారు. గద్ధర్ వంగపండు పాటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *