లక్ష్మీరాయ్‌ మామూలుగా రెచ్చిపోలేదు

సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు చేసుకుంటూ, ఐటెమ్‌ సాంగ్స్‌లో కనిపిస్తూ ఏ లిస్ట్‌ హీరోయిన్ల జాబితాలోకి చేరలేకపోయిన లక్ష్మి రాయ్‌ బాలీవుడ్‌ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలో లీడ్‌ రోల్‌ కొట్టేసింది. జూలీ 2 చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తోన్న లక్ష్మిరాయ్‌ మొదటి సినిమాతోనే బాలీవుడ్‌ని షేక్‌ చేయబోతోంది.

ఎరోటిక్‌ థ్రిల్లర్లు బాలీవుడ్‌లో ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయినా కానీ లక్ష్మిరాయ్‌ స్థాయిలో ఎవరూ ఎక్స్‌పోజింగ్‌ చేసి వుండరనే లెవల్లో ఆమె రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రెయిలర్‌ చూసిన వాళ్ల స్పందన చూస్తోంటేనే లక్ష్మిరాయ్‌ ఏ స్థాయిలో అందాల ప్రదర్శన చేసిందనేది అర్థమవుతోంది. సన్నీలియోన్‌, జరీన్‌ ఖాన్‌ లాంటి వాళ్లని చూసిన బాలీవుడ్‌ ఆడియన్స్‌ లక్ష్మిరాయ్‌కి కితాబులు ఇచ్చేస్తున్నారు.

సినీ పరిశ్రమ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో లక్ష్మిరాయ్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యే వర్ధమాన నటిగా కనిపిస్తోంది. పాత్రకి అనుగుణంగా కనిపించేందుకు ఆమె ఎంతో కసరత్తు చేయడమే కాకుండా, సగటు బాలీవుడ్‌ హీరోయిన్లు చేయడానికి ధైర్యం చేయని సీన్లు చేయడానికి కూడా వెనకాడలేదు. జూలీ 2 హిట్‌ అవుతుందో లేదో పక్కనుంచితే, లక్ష్మిరాయ్‌ మాత్రం ఈ ట్రెయిలర్‌తోనే బాలీవుడ్‌ దృష్టిని తనవైపుకి తిప్పుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *