యాంకర్‌ సుమకు షాకిచ్చిన యువహీరో!

హీరోయిన్లతో సమానంగా సూపర్‌ పాపులర్‌ అయిన యాంకర్‌ సుమ. తన వాక్ప్రవాహంతో బుల్లితెర మీదనే కాకుండా సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాంటి సుమకు ఇటీవల జరిగిన ‘శతమానం భవతి’ ఆడియో ఫంక్షన్‌లో షాకిచ్చాడు యువ హీరో రాజ్‌తరుణ్‌.

ఈ సినిమా పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్‌ ప్రకారం తెరకెక్కినది కావడంతో.. వచ్చిన అతిథులందరినీ ‘మీ పెళ్లెప్పుడు’ అని అడిగి ప్రశ్నలు రాబట్టింది సుమ. యువ హీరో రాజ్‌తరుణ్‌ వేదికపైకి రాగానే.. ‘నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా’ అని ప్రశ్నంచింది. దీనికి రాజ్‌తరుణ్‌.. ‘ఇప్పటికీ మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. ఆ ఆలోచన ఉండేది. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేద’ని సమాధానమిచ్చాడు. ఈ జవాబుకు సుమతో పాటు అక్కడికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. వెంటనే తేరుకున్న సుమ రాజ్‌తరుణ్‌కు ‘హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ అని చెప్పి పంపించింది.
Videos

Leave a Reply

Your email address will not be published.