రాజ చెయ్యి వేస్తే లో తారక్ ఫస్ట్ లుక్కే కేక పుట్టిందిగా?

అప్పటివరకూ రోటీన్ అన్న మాటకు భిన్నమైన ఫీల్ కలిగించటమే కాదు.. మరింత ఆసక్తిని పెంచేలా ఉంటాయి ప్రచార చిత్రాలు. టీజర్ దాకా కూడా అక్కర్లేదు.. ఫస్ట్ లుక్ లోనే ఇరగదీసేలా ఉంది నందమూరి తారకరత్న తాజా చిత్రం.. రాజా చేయి వే్స్తే తొలి స్టిల్. చాలా భిన్నమైన క్యారెక్టర్ ను పోషించినట్లుగా తారకరత్న లుక్ చూస్తేనే అర్థమవుతుంది.రగిలిపోయే కసి.. లక్ష్యాన్ని చేధించాలన్న పట్టుదల.. సాధించాలన్న తపన కనిపించేలా బాడీ లాంగ్వేజ్.. రఫ్ గా ఉన్న గడ్డంతో తారకరత్న భిన్నంగా దర్శనమిచ్చి ఈ చిత్రం మీద మరింత ఆసక్తి పెంచేలా చేశాడు. నందమూరి తారకరత్నకు హ్యాపీ బర్త్ డే చెబుతూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఈ చిత్రం మీద భారీ అంచనాల్ని పెంచేలా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published.