మునుపెన్నడూ చూడని విధంగా భారతం చూపిస్తా: రాజమౌళి

అపజయమంటే ఏంటో తెలియని డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి దాకా ఏ సినిమా తీసినా.. దేనికదే ప్రత్యేకం. ప్రతి సినిమాకు అంత వైవిధ్యం జోడించి సినిమా తీస్తాడు రాజమౌళి. అందుకేనేమో ఈ సినిమా శిల్పికి జక్కన్న అని పేరు పెట్టాడు ఎన్టీఆర్. తాజాగా ఈ జక్కన్న తన చిరకాల వాంఛను మరోసారి వెల్లడించాడు. ఆ చిరకాల వాంఛ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. అదే ‘మహాభారతం’. అవును బాహుబలి అనుభవాలపై ఏర్పాటు చేసిన సౌత్ కాన్‌క్లేవ్ 2017లో తన మనసులోని బలమైన కోరికను వెల్లడించాడు. మహాభారత కథను మునుపెన్నడు చూడని విధంగా భారీ స్థాయిలో తెరపై చూపించాలన్నదే తన కోరిక అని చెప్పాడు.

అందులో నుంచి ఓ పాత్రను తీసుకున్నా.. ఓ ఉపకథను ఎంపిక చేసుకొన్నా తనను ఎంతగానో ప్రభావితం చేస్తుందని చెప్పాడు. ఓ కథను తెరపై చూపించాలనుకున్నప్పుడు ముందు తనకు అది నచ్చాలని, తర్వాతే ప్రేక్షకులని చెప్పాడు. ప్రస్తుతం తీస్తున్న బాహుబలి సినిమా ప్రభావాన్ని 30 ఏళ్ల తర్వాత కూడా జనం గుర్తుంచుకోవాలని అన్నారు. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ఓ కథ ఒరిజినాలిటీ విషయంలో తనకు పెద్దగా మార్కులేమీ పడవని, అమర్ చిత్ర కథల నుంచే తాను ఎక్కువగా స్ఫూర్తి పొందుతానని వివరించాడు. భాషకు, సినిమాకు సంబంధం లేదని, విజువల్సే కథను, ఎమోషన్లను ప్రేక్షకులకు చేరవేస్తాయని అన్నాడు. ఫలానా ప్రాంతం వాళ్లు ఫలానా జోనర్ చిత్రాలే చూస్తారు అనేదానికి తాను పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించాడు. కాగా, బాహుబలి-2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు సినీ శిల్పి జక్కన్న. బాహుబలి సినిమా తీయడం కోసం తన సినిమాలన్నింటినీ ఓ సారి చూసుకున్నానని, అవే తనను ఇంత భారీ సినిమా తీసేలా పురికొల్పాయని వివరించాడు. మరి, తన భావాలను పంచుకున్న జక్కన్న.. మహాభారతాన్ని తెరపై ఎప్పుడు చెక్కేది మాత్రం వెల్లడించలేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *