ఫీలింగ్ ప్రౌడ్: ‘జనతా గ్యారేజ్’పై దర్శకుడు రాజమౌళి రి‘వ్యూ’…

దర్శకుడు రాజమౌళి తన సినిమాలతో బిజీగా ఉంటూనే….. రెగ్యులర్‌గా తెలుగులో విడుదలయ్యే సినిమాలు చూస్తుంటాడు, ఆయా సినిమాలపై తన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.

ప్రేక్షకులు అంతగా రిచ్ కానీ కొన్ని మంచి చిన్న సినిమాలు… రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా ఇచ్చే రివ్యూల ద్వారా మంచి వసూళ్లు సాధించిన సందర్భాలు అనేకం. రాజమౌళి ఇచ్చే రివ్యూలపై ప్రేక్షకుల్లో అంత నమ్మకం ఉండబట్టే ఇదంతా సాధ్యం. తాజాగా రాజమౌళి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని చూసారు. తెల్లవారు ఝామున 4 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లి ఏరియాలో వేసిన స్పెషల్ బెనిఫిట్ షో చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

జనతా గ్యారేజ్ లో నాకు బాగా నచ్చిన అంశం తారక్, మోహన్ లాల్ కాంబినేషన్. ఇద్దరి మద్య ఇంటెన్సిటీ చాలా బావుంది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్, మోహన్ లాల్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్ ప్లానింగ్ చేసుకోవడం చూస్తుంటే గర్వంగా ఫీలవుతున్నాను అంటూ రాజమౌళి తెలిపారు. గవర్నమెంట్ క్లర్క్ పాత్రలో నా ఫ్రెండ్ రాజీవ్ కనకాల హార్ట్ వార్మింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాను వరుసగా రెండు సార్లు చూసి చాలా ఎంజాయ్ చేసాను అని రాజమౌళి తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *