‘రోబో’-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం,ఫస్ట్ లుక్ (ఫొటోలు)

రజనీకాంత్‌-శంకర్‌ ద్వయం నుంచి వచ్చిన ‘రోబో’ మంచి సక్సెస్ ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపుదిద్దుకుంటోంది. అదే ‘2.0’. ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ నిన్న సాయింత్రం (నవంబర్ 20న) విడుదల చేసారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి, మరి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ పంక్షన్ లో విడుదల చేసిన ‘2.0’ ఫస్ట్ లుక్ ఓ రేంజిలో స్పందన వస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ ఈవెంట్ ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమాకు జరగనంత గ్రాండ్ గా జరిగింది. ఈ పంక్షన్ నిన్న సాయింత్రం ఐదు గంటలకు గ్రాండ్ గా మొదలైన రాత్రిదాకా సాగింది… ఈ పంక్షన్ కు సినిమా టీమ్ తో పాటు సల్మాన్ వంటి అనుకోని అతిధులు సైతం విచ్చేసారు. ఈ ఫంక్షన్ కు చెందిన ఫొటోలను ఇక్కడ మీకు అందిస్తున్నాం… చూడవచ్చు.

మొదటి నుంచి శంకర్‌ సినిమాలంటే లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అన్నట్టుగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఆయన తీసిన ‘రోబో’ చూశాక ఆ అభిప్రాయం నిజమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పంక్షన్ హంగామా చూసిన తర్వాత ఆ అంచనా కాస్త ‘అంతకుమించి…’ అన్నట్టుగా మారింది.

సంచలన విజయం సాధించిన రోబో సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. అమీజాక్సన్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2017 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘2.0′.అక్షయ్‌కుమార్‌ ఇందులో విలన్‌పాత్ర పోషిసున్నారు. ‘యుద్ధం మొదలైంది’ అంటూ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఇందులో బాలీవుడ్‌నటుడు అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్‌ బ్లాక్‌ క్రో వేషధారణలో ఉన్న ఫొటోలు ఇదివరకే సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. తాజాగా అక్షయ్‌ సినిమాలోని తన ఫస్ట్‌లుక్‌ని ఫేస్‌బుక్‌లో అధికారికంగా విడుదల చేశాడు. ఇందులో అక్షయ్‌ పసుపు రంగు కళ్లు, భయంకరమైన చేతి గోళ్లతో ఆకట్టుకుంటున్నాడు.

వేడుకనుద్దేశించి రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచబోతోంది. అయితే ఇందులో హీరోని నేను కాదు, అక్షయ్‌కుమారే. నాకు ఎంపిక చేసుకొనే అవకాశమొచ్చుంటే నేను అక్షయ్‌కుమార్‌ పాత్రనే ఎంచుకొనేవాణ్ని అని చెప్పుకొచ్చారు. దర్శకుడు శంకర్‌తో పనిచేయడం చాలా కష్టం. ఆయనొక పర్‌ఫెక్షనిస్ట్‌. భారతీయ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది. త్రీడీలో నన్ను నేను చూసుకోవడం కొత్తగా అనిపించింది”అన్నారు

‘రోబో’కి కొనసాగింపుగా 2.0తో పాటు, మరొక చిత్రం కూడా ఉండబోతోంది.ఈ సినిమా ప్రయాణం భుజాలపై ఒక ఎవరెస్ట్‌ని పెట్టుకొని ఎవరెస్ట్‌ని ఎక్కుతున్నట్టుగా అనిపిస్తోంది”అన్నారు దర్శకుడు శంకర్‌.

‘నా జీవితంలో ఎప్పుడూ మేకప్‌ వేసుకోలేదు. కానీ ఈ సినిమా కోసం రోజూ 3 గంటలపాటు మేకప్‌ వేసుకొని నటించాల్సి వచ్చింది. రజనీకాంత్‌గారితో కలిసి నటించడం చక్కటి అనుభవం.భారతీయ చిత్ర పరిశ్రమలో ‘2.0′ ఓ చరిత్రని సృష్టించబోతోంది” అన్నారు.

సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు శంకర్‌ ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. 2.0 కోసం చాలా శ్రమిస్తున్నాము”అన్నారు. రెహమాన్, శంకర్ ల కాంబినేషన్ లో ఇంతకు ముందు చాలా హిట్స్ వచ్చాయి. అన్నీసూపర్ హిట్స్ అయ్యీయి. దాంతో ఈ సినిమా ఆడియో కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.

ఇంతమంది లెజండ్స్ తో పనిచేస్తానని నేను ఊహించలేదు. సెట్స్ పై అంతా ఫ్యామిలీలాగ ఉన్నారు. షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయింది. శంకర్ సార్ ప్రతీవిషయం విడమర్చి చెప్పేవారు అని అమి జాక్సన్ మాట్లాడారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *