తేజస్ లో ప్రయాణించి చరిత్ర సృష్టించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

దేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. 30 నిమిషాల విన్యాసం కోసం ఈ యుద్ధవిమానం ఇవాళ ఉదయం 9.58కి బెంగళూరులోని హెచ్ఏఎల్ నుంచి బయల్దేరింది. కాగా బయల్దేరే ముందు 45 స్క్వాడ్రన్‌ ఫ్లయింగ్ డాగర్స్‌ కు చెందిన పైలట్లు విమానం గురించి రాజ్‌నాథ్‌కు పరిచయం చేశారు. ఏవియానిక్స్, నియంత్రణ, రాడార్, గ్లాస్ కాక్‌పిట్లతో పాటు యుద్ధంలో ఇది మోసుకు పోయే ఆయుధాలను కూడా వివరించారు.

భారత వైమానిక దళం అమ్ములపొదిలో తేజస్‌ యుద్ధ విమానాలను చేర్చిన విషయం తెలిసిందే. ఈ విమానానికి సంబంధించిన నేవీ వెర్షన్ గతవారం కీలక పరీక్ష పూర్తిచేసుకుంది. ‘అరెస్టెడ్‌ ల్యాండింగ్‌’ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా విమానవాహక నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని అది ప్రదర్శించింది. దీంతో ఇలాంటి యుద్ధవిమానాన్ని రూపొందించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

Videos