ఆ టాలీవుడ్ హీరోతో ర‌కుల్ డేటింగ్‌..!

టాలీవుడ్‌లో ఇప్పుడు వ‌రుస‌గా అంద‌రూ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ స్టార్ హీరోయిన్‌గా నెంబ‌ర్ వ‌న్ స్టేట‌స్ రేసులో ఉంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. వ‌రుస‌గా స్టార్హీరోల‌తో న‌టిస్తూ వ‌రుస హిట్లు కొడుతున్న ర‌కుల్ ఇప్పుడు ఓ హాట్ న్యూస్‌తో వార్త‌ల్లో నానుతోంది. ర‌కుల్ కేరీర్ ఇప్పుడు బ్రేకుల్లేని రైలులా దూసుకుపోతోంది. ఈ యేడాది ఇప్ప‌టికే నాన్న‌కు ప్రేమ‌తో, స‌రైనోడు లాంటి హిట్ సినిమాల్లో న‌టించింది.

అయితే ర‌కుల్ ఇప్పుడు ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె ఎక్క‌డికి వెళ్లినా స‌ద‌రు హీరోనే తోడుగా ఉంటున్నాడ‌ట‌. ర‌కుల్ ఇటీవ‌ల ఓ డిన్న‌ర్‌కు వెళ్లినా, పార్టీల‌కు వెళ్లినా కూడా ఆ హీరో ఆమె ప‌క్క‌నే ఉంటున్నాడ‌ట‌. అలాగే వీరిద్ద‌రు బెంగ‌ళూరు ప్రో క‌బ‌డ్డీ మ్యాచ్‌ల వ‌ద్ద కూడా చెట్టాప‌ట్టాలేసుకుని నానా హంగామా చేస్తున్నార‌ట‌.

ఇంత‌కు ఆ హీరో ఎవ‌రో కాదు రానా ద‌గ్గుపాటి. తాజాగా వీరు రెండు రోజుల పాటు బెంగ‌ళూరులోనే మ‌కాం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఆదాబ్ రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి కనిపించిన‌ట్టు తెలుస్తోంది. ఇక వీరు పార్టీల‌కు వెళ్లినా క‌లిసి, ఒక‌రు చేతిలో మ‌రొక‌రు చెయ్యి వేసుకుని మ‌రీ వెళుతున్నార‌ట‌. రానా మామూలుగానే పార్టీ బోయ్. మ‌నోడు త‌ను పార్టీ ఇచ్చినా, ఏ పార్టీకి వెళ్లినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా తీసుకెళ్లి మరి పరిచయం చేస్తున్నాడట.

కొద్ది రోజుల క్రితం ర‌కుల్ హైద‌రాబాద్‌లో ప్రారంభించిన జిమ్ ప్రారంభోత్స‌వానికి కూడా రానా వెళ్లాడు. ఇక ఆమె హైద‌రాబాద్‌లో కొన్న ఇంటికి కూడా రానా హెల్ఫ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న వారు, వీరి స్టోరీ తెలిసిన వారు వీరు డేటింగ్‌లో ఉన్న‌ట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రి అస‌లు నిజాలు దేవుడికే ఎరుక‌..!

Videos

39 thoughts on “ఆ టాలీవుడ్ హీరోతో ర‌కుల్ డేటింగ్‌..!

Leave a Reply

Your email address will not be published.