బాలయ్య వస్తున్నారని మేం ముందుకొచ్చాం -చరణ్

ఇప్పటికే ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ మరి ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి ఒక క్లారిటీ ఇచ్చేసినప్పటికీ.. ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమాను తానే ”కొణిదెల ప్రొడక్షన్స్” బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి.. తనే ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

”ఖైదీ నెం 150 సినిమాను జనవరి 11న రిలీజ్ చేస్తున్నాం. నాన్నగారి వినాయక్ గారి ఎప్రూవల్ తీసుకుని.. ఈ తేదీని ఫిక్స్ చేసుకున్నాం. మా డిస్ర్టిబ్యూటర్లు అందరూ ఈ డేట్ తో హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాం. ముందుగా మేం 12న రావాలని అనుకున్నాం. కాకపోతే బాలయ్య గారి సినిమా అదే రోజున వస్తుందని ప్రకటించారు. రెండు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజున రావడం ఇండస్ర్టీ కి మంచిది కాదని నాన్నగారు చెప్పడంతో.. 11న అయితే బెటర్ అని ఈ తేదీ ఫిక్స్ చేశాం” అన్నాడు రామ్ చరణ్.

”ఇక జనవరి 4న విజయవాడలో పర్మిషన్లో ఇష్యూ కారణంగా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు 7న విజయవాడ గుంటూరు హైవేలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఈవెంట్ జరుగుతోంది. మన అన్నయ్య ఫ్యాన్స్ అందరూ అక్కడికి రావాలని కోరుకుంటున్నా” అంటూ వెన్యూ గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఇపకపోతే గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ క్లాష్ గురించి మరింత మాట్లాడిన చరణ్.. ”సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు హ్యాపీగా రావొచ్చు. గతంలో నాదీ మహేష్ సినిమా కూడా ఇలాగే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో అండ్ నాది ఏదో సినిమా. రెండూ బాగా ఆడాయ్.. డబ్బులొచ్చాయ్. సో.. క్రిష్ అండ్ బాలకృష్ణ గార్లకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా” అంటూ ముగించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *