చిరు 150వ సినిమాలో కూడా కక్కుర్తేనా మెగా ప్రొడ్యూసర్?

దాదాపు దశాబ్ధం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా….చిరంజీవి కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ ఫిల్మ్‌గా నిలిచిపోవాల్సిన సినిమా, సినిమా కూడా అదే రేంజ్‌లో వచ్చిందని ప్రచారం చేశారు. బయ్యర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి సినిమాను అమ్మేటప్పుడు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. చెప్పిన రేటుకి సై అంటేనే అమ్ముతాం…లేకపోతే సొంతంగా రిలీజ్ చేసుకుంటాం అని కరాఖండీగా చెప్పేశారు. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని సినిమాను కొనేవాళ్ళకు, టిక్కెట్ కొనేవాళ్ళకు ప్రామిస్ చేశాడు చరణ్. కానీ అమ్మేదగ్గరకొచ్చేసరికి ఒక్క రూపాయి కూడా తగ్గని చరణ్….పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం పూర్తిగా అల్లు అరవింద్ పిసినారి తెలివితేటలను ఫాలో అయ్యాడని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

ఖుషీలాంటి ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సొంత డైరెక్షన్‌లో పవన్ హీరోగా సినిమా అంటే వేరే ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టడానికి రెడీ అవుతాడు. కానీ అల్లు అరవింద్ మాత్రం కనీస స్థాయిలో కూడా ఖర్చుపెట్టలేదు. అలాగే చిరంజీవి కెరీర్‌లో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా పడిన వెంటనే తన సొంత ప్రొడక్షన్‌లో సినిమా చేసే తెలివితేటలను చూపించిన అల్లు అరవింద్ …ఆ స్థాయిలో ఖర్చు పెట్టిన సినిమా మాత్రం ఒక్కటి కూడా కనిపించదు. బద్రినాథ్, మగధీర సినిమాలను పక్కన పెడితే అల్లు అరవింద్ తీసిన సినిమాలన్నీ ఇదే బాపతు. కానీ ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ విషయంలో రామ్ చరణ్ కూడా అల్లు అరవింద్ బాటలో నడుస్తాడని ఊహించలేదని ఇప్పుడు ఆ సినిమాను కొన్నవాళ్ళు, చూసిన ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

చిరంజీవిని గ్లామరస్‌గా చూపించడం కోసం టాప్ రేంజ్ కెమేరా మేన్‌ని తీసుకున్న చరణ్…బిజినెస్ క్రేజ్ కోసం దేవిశ్రీని ఫైనల్ చేశాడు. అఖిల్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన వినాయక్‌కి ఎంత ఇచ్చి ఉంటారో ఊహించుకోవచ్చు. సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో కనిపించే అందరినీ కొత్తవాళ్ళనే తీసుకున్నాడు చరణ్. అలాగే సినిమాకు ప్రాణం పోయాల్సిన రైతుల పాత్రల కోసం అయినా పేరున్న నటులను తీసుకుని ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ కోసం బెల్లం కొండ సురేష్ పెట్టిన స్థాయి కూడా పెట్టలేకపోయాడు చరణ్. మామూలు సినిమా అయితే ఎంత బడ్జెట్‌లో తీశారు అనేది పెద్ద ప్రయారిటీ అవ్వకపోవచ్చు కానీ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకి ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా వేరే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఖర్చుకు కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టి ఉండేవాడు.

చిరంజీవి కెరీర్‌లోనే స్పెషల్ ఫిల్మ్ అవ్వాలంటే అలా చేయాలి కూడా. కానీ చరణ్ మాత్రం కేవలం పాతిక కోట్లలోపే సినిమాను ఫినిష్ చేశాడని చెప్తున్నారు. అందుకే దాదాపు యాభై కోట్ల రూపాయల ప్రాఫిట్ తీసుకుని ఉంటాడని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. చరణ్ కంటే కూడా బాలకృష్ణతో సినిమా తీసిన క్రిష్‌నే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తెరకెక్కించాడని చెప్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇప్పటి వరకూ యాభై కోట్ల సినిమా లేకపోయినప్పటికీ బాలకృష్ణ వందవ సినిమా కథకు అవసరమైన స్థాయిలో ఖర్చుపెట్టే విషయంలో ఎక్కడా వెనుదీయలేదు క్రిష్. కానీ రామ్ చరణ్ మాత్రం పక్కాగా లాభాల గురించి ఆలోచించి వీలైనంత తక్కువ ఖర్చులో సినిమా తీసేలా చేశాడని చెప్తున్నారు.

ప్రొడ్యూసర్‌గా మొదటి సినిమాతోనే అల్లు అరవింద్‌కి ఉన్న బ్రాండ్ వేయించుకున్నాడు ఛరణ్. ఒక్క సినిమాకు యాభై కోట్ల ఆదాయం అంటే చాలా చాలా గొప్ప విషయమే కానీ….అంతకంటే కూడా చిరు 150వ సినిమా ఆయన కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచిపోయేలా ప్లాన్ చేసి ఉంటే జీవితాంతం గొప్పగా చెప్పుకునేలా ఉండేదేమో. మహా అయితే హీరోగా ఇంకో నాలుగు సినిమాలు చేయగలడు చిరంజీవి. మనం విషయంలో నాగార్జున ఆలోచించినట్టుగా……ఆ నాలుగు సినిమాల్లో రెండైనా చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తారో….లేకపోతే కేవలం కమర్షియల్ హిట్స్ కోసం, క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలు తీసేస్తారో చూడాలి మరి. బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో రాబోతున్న తర్వాత సినిమా ఎలాగూ మహా అయితే ఇంకో సరైనోడు అవుతుంది. ఆ తర్వాత సినిమాల విషయంలో అయినా కాస్త కొత్తగా ఆలోచిస్తారేమో చూడాలి మరి.

Videos

2 thoughts on “చిరు 150వ సినిమాలో కూడా కక్కుర్తేనా మెగా ప్రొడ్యూసర్?

Leave a Reply

Your email address will not be published.